హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5.75 శాతం వార్షిక వడ్డీతో రుణాలు: ఎస్ఈ

ATP: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని APSPDCL ఎస్ఈ శేషాద్రి శేఖర్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని అనంత టౌన్ షిప్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకానికి బ్యాంకుల ద్వారా 5.75 శాతం వార్షిక వడ్డీతో రుణాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలో 42 మంది వెండర్లకు లక్ష్యాలు నిర్దేశించినట్లు వివరించారు.