హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామూరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిక

ప్రకాశం: పామూరు మండలం పామూరులో ఆదివారం వైసీపీకి చెందిన పలు కుటుంబాలు టీడీపీలో చేరారు. సర్పంచ్ అల్లూరి రాగమ్మ, ఉప సర్పంచ్ యాదల సాయి కిరణ్‌తో పాటు పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ తగు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు.