KDP: తాడిపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజీపేట మండలం సర్వర్ఖాన్‌పేటకు చెందిన కమలాపురం ఏజదన్ మృతి చెందాడు. కొత్తపల్లెకు చెందిన కాజా మొహిద్దీన్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ మినీ లారీలో తాడిపత్రి నుంచి ఖాజీపేటకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి


