హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడపవలసలో తాగునీటికి తిప్పలు

ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ అడపవలసలో 5 రోజులుగా తాగునీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ ఆదివారం మాట్లాడారు.  70 కుటుంబాలున్న గ్రామంలో తాగునీటి బోరు మోటార్ పాడవడంతో సమస్య తలెత్తిందని వాపోయారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు.