హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిగుడ్ల లెక్కల్లో అవకతవకలు.. డీఈవోకు షోకాజ్

అన్నమయ్య జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్ల సరఫరా, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలపై ఆర్జేడీ శ్యాముయేలు డీఈవో సుబ్రమణ్యంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎండీఎం పోర్టల్‌లో అధిక సంఖ్యలో గుడ్లు నమోదు చేసి సుమారు రూ.12 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.