అనంతపురం జిల్లా తాడిపత్రిలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, వీధులు జలమయమై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ నిలిచిపోయింది. అయితే తాడిపత్రితో పాటు యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లోనూ వర్షం పడటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షానికి జలమయమైన రోడ్లు


