KRNL: పెద్దకడబూరు గ్రామ శివారులోని ఎల్‌ఎల్‌సీ కాలువ సమీపంలో గత రాత్రి కురిసిన వర్షానికి చెట్టు నేలకొరిగింది. దీంతో రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై పడిన చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద నేలకొరిగిన భారీ చెట్టు


