హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ

WG: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు CI రమేశ్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో మెలగాలని స్పష్టం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.