హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై కూలిన భారీ చెట్టు

ASR: కొయ్యూరు మండలం పోకలపాలెం–గోధుమలంక గ్రామాల మధ్య ప్రధాన మార్గంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో ఈ రూట్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, కూలిపోయిన చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.