హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణుక యల్లమాంబకు విశేష పూజలు

KDP: సిద్ధవటం (M) మాచుపల్లి గ్రామంలోని శ్రీశ్రీ రేణుక యల్లమాంబ ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకంతో పాటు పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.