హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట'

ELR: కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం పవర్ పేటలోని తన క్యాంపు కార్యాలయంలో 11 మంది బాధితులకు రూ. 12.25 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఇందులో 8 మందికి రూ. 7.67 లక్షల చెక్కులు, ముగ్గురికి రూ. 4.57 లక్షల ఎల్‌వోసీలు అందించారు.