హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాధవరం-1లో రూ.84 వేలకు గణేష్ లడ్డూ

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణేష్ యువజన సభ్యుల ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన మేరువ కోదండరామయ్య రూ.84 వేలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను కోదండరామయ్యకు అందజేశారు.