హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యపై గ్రామస్థుల ఆవేదన

అన్నమయ్య: టీ.సుండుపల్లి మండలం సిద్ధారెడ్డిగారిపల్లిలో తాగునీటి మోటరు చెడి రెండు వారాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు. పంచాయతీలో నిధులు లేవంటూ చేతులెత్తేయడంతో గ్రామస్థులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ఎంపీడీవో స్పందించి వెంటనే మోటరుకు మరమ్మతులు చేయించాలని, లేదంటే తాత్కాలికంగా నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి తమ దాహం తీర్చాలని కోరారు.