హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరిగినేని తిరుపతి నాయుడుకు నివాళులు

ప్రకాశం: పామూరు మండలం మోపాడులో మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు జయంతి సందర్భంగా ఆదివారం ఆయన సమాధి వద్ద కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.