హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దాసుడుపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు (35) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కోసం మాంసం కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.