కాకినాడ పోర్ట్ నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు తొలిసారిగా రైల్వే ద్వారా వుడ్ పల్ప్ రవాణా ప్రారంభమైంది. భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రకమైన సరకును రైలులో లోడింగ్ చేశారు. గతంలో రోడ్డు మార్గంలో సాగిన 1,061 కిలోమీటర్ల సుదూర రవాణాను ఇప్పుడు రైలు మార్గానికి విజయవంతంగా మళ్లించారు. ఈ సరుకు రవాణాతో సమయం, వ్యయం గణనీయంగా ఆదా కానుంది.
ఆంధ్రప్రదేశ్
దేశంలో ఫస్ట్ టైమ్.. రైలులో వుడ్ పల్ప్


