సత్యసాయి: మడకశిర పట్టణంలోని హిందూపురం రోడ్డు వద్ద గల వడ్రపాళ్యం సమీపంలో ఐచర్ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. రోడ్డుపై వాహనం బోల్తా పడటంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మడకశిరలో వాహనం బోల్తా


