హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ

PLD: వినుకొండలో ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహించారు. పలు మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఉత్సవ కమిటీలను అభినందించి, అనంతరం భక్తులకు స్వయంగా భోజనం వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.