ELR: నాలుగు రోజుల క్రితం కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన పాల్రాజు (16) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గత నాలుగు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగించగా, వేలేరుపాడు మండలం తాటుకూరుగొమ్ము రేవు వద్ద శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విగతజీవిగా తేలిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలో బాలుడి మృతదేహం లభ్యం


