హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరు మార్చుకున్న జిల్లా సబ్ కలెక్టర్

PLD: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పల్నాడు జిల్లా సబ్ కలెక్టర్ వి. సంజనా సింహ తన పేరును మార్చుకున్నారు. ఇకపై ఆమె పేరు 'సంజనా శ్రీహర్ష’గా మారింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పత్రాలను సంబంధిత శాఖకు పంపించారు.