హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న పౌరాణిక పోటీలు

పార్వతీపురంలో శ్రీవాణీ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉత్తరాంధ్ర స్థాయి పౌరాణిక పద్య ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 13వ వార్షికోత్సవం సందర్భంగా లయన్స్ కల్యాణ మండపంలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు.