హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్‌ మేళాకు విశేష స్పందన

కృష్ణా: పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో 30 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామారావు తెలిపారు. ఈ మేళాకు 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాగా 75 మంది నిరుద్యోగులు వచ్చారని.. ఇందులో 30 మందిని ఎంపిక చేశామన్నారు. మరో 25 మంది నుంచి బయోడేటా తీసుకుని తదుపరి వెరిఫికేషన్‌కు పంపించామన్నారు.