హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఐదు రోజులపాటు వర్షాలు

ASR: ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఉత్తరకోస్తా-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.