హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ చేపల చెరువులపై తనిఖీ

KDP: మైలవరం రిజర్వాయర్ సమీపంలోని అక్రమ చేపల చెరువులను ఆప్కాఫ్ ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 10, 15 ఎకరాల రెండు చెరువులను గుర్తించారు. చేపలకు చికెన్ వేస్ట్ వినియోగిస్తున్నట్లు తేలడంతో నిర్వాహకులను హెచ్చరించారు. చెరువులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.