హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అత్తారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పద మృతి

కర్నూలు: ఆదోని అమరావతి నగర్‌లో అత్తారింటికి వచ్చిన అల్లుడు వీరేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరికెరి గ్రామానికి చెందిన వీరేష్‌కు అమరావతి నగర్‌కు చెందిన శైలుతో వివాహం కాగా, వీరికి మూడు నెలల పాప ఉంది. పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించగా, డీఎస్పీ వెంకటరమణ, 1 టౌన్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.