ATP: వజ్రకరూరు మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు మోస్తారు వర్షం కురిసింది. వంకకు భారీగా వర్షపు నీరు రావడంతో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఉరవకొండ నుంచి ఛాయపురం మధ్య వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షం.. కొట్టుకుపోయిన రోడ్డు


