ప్రకాశం: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3వ సోమవారం 'ప్రత్యేక గ్రీవెన్స్ డే' నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 21న మధ్యాహ్నం ఒంగోలులోని కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీటింగ్ హాల్లో కార్యక్రమం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో ప్రత్యేక గ్రీవెన్స్ డే


