హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమృత్ 2.0 శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

పల్నాడు: నరసరావుపేట-రావిపాడు రోడ్డులోని కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ పార్కు వద్ద జరగనున్న అమృత్ 2.0 శంకుస్థాపన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.