హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నందిగామలో గణేష్ నిమజ్జనం

NTR: నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా జరిగిన శ్రీ గణపతి మహోత్సవం 6వ వార్షికోత్సవం ఇవాళ ఘనంగా ముగిసింది. ఏడు రోజుల పూజా కార్యక్రమాల అనంతరం, సాయంత్రం 6 గంటలకు భారీ గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.