హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాలకు నిలయంగా మారిన తిరువూరు బైపాస్

NTR: తిరువూరు బైపాస్ జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. బొమ్మరిల్లు రెస్టారెంట్, MDO ఆఫీస్ రోడ్డు, లంబాడీ తండా రోడ్డు కలిసే చోట రాత్రి వేళల్లో వెలుతురు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి, రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.