సత్యసాయి: చేనేత పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు చేనేత, జౌళి శాఖ ఉద్యోగులు రమణారెడ్డి, శీనా నాయక్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. పింఛన్లు ఇప్పిస్తామని దరఖాస్తుదారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని మంత్రి సవితకు ఫిర్యాదులు వెళ్లాయి. బాధ్యులపై ఆమె తక్షణ చర్యలకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్


