హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షం

ATP: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా భారీ వర్షం పడుతోంది. చాలా రోజుల విరామం తర్వాత కురిసిన ఈ వానతో ఎండిపోతున్న పంటలకు ఊరట లభించింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఆటంకం కలిగింది. వర్షంతో వాగులు దాటే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.