హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జనసేన న్యాయవాదుల సమావేశం'

BDK: ఖమ్మంలో నేడు జనసేన తెలంగాణ న్యాయవాదుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. జనసేన మహిళా నాయకురాలు శిరీష పొన్నూరు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్లతో సంప్రదింపులు, న్యాయవాదుల సమన్వయం, న్యాయపరమైన సేవల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన లీగల్ సెల్ నిర్మాణం చేసే దిశగా ముందుకు సాగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.