BDK: బూర్గంపహాడ్ మండలంలో సీనియర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్వామి ఏఎస్సై గా పదోన్నతి పొందారు. పదోన్నతి అనంతరం ఎస్పీ రోహిత్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. బూర్గంపహాడ్ మండలంలో విధులు నిర్వహిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగిన స్వామికి సహచరులు, స్థానికులు అభినందనలు తెలిపారు. ఆయన సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.
తెలంగాణ
ASIగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ స్వామి


