హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితులకు కేంద్రమంత్రి సాయం

SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు సహాయం అందించి, వారిని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చడంతో స్థానికులు అభినందించారు.