హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ చొరవతో తాగునీరు సమస్యకు చెక్

KMR: పెద్దకొడప్గల్ మండలం బాబుల్గామా గ్రామస్థులు కొన్ని నెలలుగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచి రవికుమార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో అభినవ్ చందర్‌ను ఆదేశించారు. అధికారులు గ్రామంలో శనివారం బోరుబావిని తవ్వించారు.