హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.