హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువు విషయంలో శ్రద్ధ వహించాలి: ఉపాధ్యాయులు

GDWL: అంతంపల్లి యూపీఎస్‌ పాఠశాలలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం మెగా పీటీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పిల్లల చదువుల పురోగతిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.