SRD: సదాశివపేట పట్టణంలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ సమీపంలో శనివారం దారుణ హత్య జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాహుల్ అనే కూలీపై, తోటి కూలీ నీరజ్ కత్తితో దాడి చేశాడు. దినసరి కూలీల మధ్య జరిగిన గొడవ ఘర్షణగా మారి ఈ హత్యకు దారితీసింది. తీవ్ర గాయాలతో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పట్టణంలో దారుణ హత్య


