హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి'

GDWL: కొత్త రాజోలి KGBV వద్ద డ్రైనేజీ మురుగు నీటితో విద్యార్థులు, రైతులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన అఖిలపక్ష నాయకులు నేడు కేజీబీవీ వద్ద పర్యటించి దుస్థితిని పరిశీలించారు. మురుగు నీటి కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సర్పంచ్‌ను కలిసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరారు.