వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరాం నగర్ కాలనీ 32వ వార్డులో కొలువుదీరిన గణనాథుడిని మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథుడిని దర్శించుకున్న ఛైర్‌పర్సన్


