SRD: సిర్గాపూర్ మండలం వాసర్ హైస్కూల్ ఆవరణలో సర్పంచ్ హనుమంతు, హెచ్ఎం మంజుల, విద్యార్థులు కలిసి శనివారం మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచితే భవిష్యత్తులో పచ్చని పర్యావరణం సాధ్యమవుతుందని తెలిపారు. మొక్కల వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచాలి: సర్పంచ్


