హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

KMR: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిమజ్జన మార్గంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.