హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ కార్మికుల హక్కులు ఎంప్లాయీస్ యూనియన్‌తోనే సాధ్యం'

ASF: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ యూనియన్‌ (AITUC) కృషి చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ డిపోలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఏఐటీయూ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.