హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్

WGL: నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లి MPUPS, శనిగరం ZPHS పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి కలెక్టర్ డాక్టర్ సత్య శారద. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు స్వయంగా పాఠాలు చెప్పారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొన్నారు.