హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీలకు అన్యాయం చేస్తే సహించం: మెట్టు గంగారం

MDK: తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు కాకుండా, 10 శాతం లేని అగ్రకులాలకు EWS రిజర్వేషన్లు ఎలా ఇస్తారని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవాధ్యక్షులు మెట్టు గంగారం ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో బీసీల సమాచారాన్ని సేకరించి, రాబోయే ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుంటామన్నారు. 2028లో బీసీ రాజ్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పచ్చంటి రాము పాల్గొన్నారు.