హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానం అనర్హతపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు

NGKL: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై BRS నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వెల్దండలో వారు మాట్లాడుతూ.. ఈ తీర్పు న్యాయం గెలిచిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులకు ఇదొక గట్టి హెచ్చరిక అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, ప్రభాకర్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.