హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

NRPT: ధన్వాన మండలం మందిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడిని శనివారం విద్యార్థులు ఘనంగా నిమజ్జనానికి తరలించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న గణనాథునికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, శ్రావణి, అనిత, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.