హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అసెంబ్లీ సాక్షిగా మంత్రి అబద్ధాలు మాట్లాడారు'

HYD: అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత BRS ప్రభుత్వ హయాంలో కృష్ణా నది నీటిని ఎప్పుడూ 35 శాతం కంటే తక్కువగా వినియోగించలేదని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28 శాతం నీటిని మాత్రమే వాడుకోగా, ఏపీ 71.5 శాతం కృష్ణా నీళ్లను వినియోగించుకుందని హరీష్ రావు విమర్శించారు.