హైదరాబాద్: 28°C
తెలంగాణ

బురదమయమైన అంగడి ప్రాంతం

MNCL: తాండూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని శనివారం అంగడి ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులు, వ్యాపారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవస్థలు పడుతూనే ప్రజలు కూరగాయలు కొనుగోలు చేశారు. మార్కెట్ ఏరియాలో వెంటనే వసతులు కల్పించి, ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.